ఇవి మీకు తెలుసా..?!

సోమవారం, 15 డిశెంబరు 2008 (11:58 IST)
* మర్డర్ అంటే ఇంగ్లీషు భాషలో హత్య మాత్రమే కాదు. "కాకుల గుంపు" అనే ఇంకో అర్థం కూడా ఉందట.

* యునైటెడ్ నేషన్స్‌కి ఆరు అధికారిక భాషలు ఉన్నాయి. అవేంటంటే... ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, చైనీస్, రష్యన్, స్పానిష్.

* ఫ్రాన్స్‌ దేశంలో 1386వ సంవత్సరంలో... ఓ బాలుడి చావుకు కారణమైందంటూ... ఒక పందిని బహిరంగంగా ఉరి తీశారట.

* లాస్‌వెగాస్‌లోని జూదం, పేకాట క్లబ్బులలో గడియారాలుండవు. టైమ్ తెలిస్తే ఇంటికెళ్లాలన్న ఆలోచన వస్తుందనే.. ఆ క్లబ్బులలో గడియారాలను లేకుండా చేశారు యజమానులు.

* ఒక కప్పు కాఫీలో వంద రసాయనాలు ఉంటాయి తెలుసా..?

* కంగారూల్లో యాభై రకాలున్నాయట. గుర్రం నిలబడి కూడా నిద్రపోతుందట పిల్లలూ..!

వెబ్దునియా పై చదవండి