నీటిలో ఇనుము మునుగుతుంది.. మరి ఓడ ఎలా తేలుతుంది?

బుధవారం, 12 అక్టోబరు 2011 (15:57 IST)
నీటిపై ఒక వస్తువు తేలాలంటే ఆ వస్తువు నీటి మీద కలిగించే బలం, అది తొలగించిన నీరు ఆ వస్తువుపై కలిగించే బలానికి సమానంగా ఉండాలి. నీటిలో ఇనుము వేసినప్పుడు ఇనుము బరువు, అది తొలగించిన నీటి బరువు కన్నా అధికంగా ఉండి ఇనుము మునుగుతుంది. అదే ఇనుమును పల్చటి రేకులా సాగదీసి అంచులు మడిచి నీటిలో విడిస్తే తేలుతుంది.

ఇక్కడ ఇనుము బరువు ఏమాత్రం మారలేదు. కానీ.. రేకు లాగా చేయడం వల్ల అది నీటిపై ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. రేకును పైకి నెట్టే నీటి పరిమాణం పెరిగి నీరు కలిగించే బలం కూడా పెరుగుతుంది. ఇదే సూత్రం ఓడకు కూడా వర్తిస్తుంది. దాని అడుగు భాగం వెడల్పుగా ఉండడం, అది నీటిపై కలిగించే బలం.. తొలగించిన నీరు ఓడపై కలిగించే బలం సమానంగా ఉండడం వల్ల ఎంచక్కా ఓడ నీటిపై తేలుతుంది.

వెబ్దునియా పై చదవండి