ప్రపంచంలో ఎక్కువ ఎత్తు ఎగరగలిగే పక్షి ఏది?

శనివారం, 15 అక్టోబరు 2011 (10:56 IST)
FILE
పక్షులు వాటి సామర్థ్యాన్ని బటి ఎత్తుకు ఎగరగలుగుతాయి. కొన్ని పక్షులు చాలా ఎత్తుకి ఎగరగలుగుతాయి. కొన్ని కొంత దూరం మాత్రమే ఎగురగలుగుతాయి. అన్నింటికన్నా ఎక్కువ ఎత్తుకి ఎగరగలిగే పక్షి ఏదో తెలుసా మీకు?

మధ్య ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో కనిపించే రూపెల్స్ గ్రిఫాన్ అనే రాబందు మిగిలిన పక్షుల కంటె ఎక్కువ ఎత్తు ఎగరగలుగుతుంది. దీనిని రూఫెల్స్ గ్రిఫిన్ అని కూడా అంటారు. ప్రస్తుతం వీటి సంఖ్య 30,000 వరకు ఉన్నప్పటికీ, అనేక కారణాల వల్ల వీటి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుంది.

19వ శతాబ్దానికి చెందిన జర్మన్ జంతు శాస్త్రవేత్త ఎడ్వర్డ్ రూపెల్ పేరునే ఈ రాబందుకి పెట్టారు. ఈ పక్షి సముద్రపు మట్టం నుంచి 36 వేల అడుగుల కన్నా ఎక్కువ ఎత్తుకి ఎగురుతుంది. అందుకే ప్రపంచంలో అన్ని పక్షుల కంటె ఎత్తులో ఎగిరే పక్షిగా రికార్డులోకి ఎక్కింది.

వెబ్దునియా పై చదవండి