సూర్యగ్రహణం అంటే ఏమిటి?

శుక్రవారం, 25 నవంబరు 2011 (16:04 IST)
FILE
భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగంలో సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనిపించకపోవటం వలన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ సూర్యగ్రహణాన్ని మొదటిసారిగా ఎక్కడ గుర్తించారంటే, క్రీస్తు పూర్వం 781 సంవత్సరం, జూన్ 4వ తేదీన మొదటిసారిగా సూర్యగ్రహణాన్ని చైనాలో గుర్తించారు. ఇది అమావాస్య రోజున ఏర్పడింది.

భూమిని చంద్రుడి పూర్ణ ఛాయ కప్పినప్పుడు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి సూర్యగ్రహణాలు భూమి మీద చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. అందుకే సంపూర్ణ సూర్యగ్రహణం పట్టే ప్రదేశాలు చాలా దూరంగా ఉన్నప్పటికీ అక్కడకు వెళ్లి చూస్తుంటారు. 1999లో యూరప్‌లో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఎక్కువమంది చూసినట్లు రికార్డు అయింది. 2009 జనవరి 26 న కూడా సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది.

వెబ్దునియా పై చదవండి