అలాగే 43% మంది 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారుగా వుంటున్నారు. 40 నుండి 50 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో, 69 మందిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. 50 నుండి 60 సంవత్సరాల వయస్సు వరకు, ఆ ప్రమాదం 43 మందిలో ఒకరికి పెరుగుతుంది. కనుక 40 ఏళ్లు దాటిన తర్వాత దీని గురించి పరీక్షలు చేయించుకుంటూ వుండాలి. మహిళలు రజస్వల అయిన అనంతరం నెలకు రెండుసార్లు చొప్పున తమ వక్షోజాలను పరిశీలిస్తూ వుండాలి.
వక్షోజం ఒకవైపు నుంచి మరోవైపుకు కదులుతోందా? లేదా?
వక్షోజంలో గడ్డలు, కణుతులు వంటివి ఉన్నాయా?
ఒకవేళ ఏమైనా గడ్డవుంటే, దానిపై చర్మం కదులుతోందా? గట్టిగా కదలకుండా ఉందా?
గొంతు, మెడ, చంకల వద్ద ఏమైనా గడ్డలుగాని కణుతులుగాని ఉన్నాయా?