అమ్మాయిల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు: కేంద్రం నిర్ణయం
గురువారం, 16 డిశెంబరు 2021 (12:14 IST)
దేశంలో ప్రస్తుతం అబ్బాయిల వివాహ కనీస వయస్సు 21 ఏళ్లు. అమ్మాయిల కనీస వివాహ వయస్సు 18 ఏళ్లుగా వుంది. అమ్మాయిల పెళ్లి వయస్సుపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలనే చట్టం ఉండగా, కనీస వయస్సుకు 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపినట్లు సమాచారం.
అమ్మాయిల కనీస వయస్సు తక్కువగా వుండటం వల్ల వారి కెరీర్‌కు అవరోధంతో పాటు.. గర్భధారణలో ఆరోగ్య సమస్య తలెత్తుతున్నాయి. అందుకే వివాహానికి అమ్మాయిల కనీస వయస్సు 21 ఏళ్లకు పెంచాలనే డిమాండ్ పెరిగింది. దీంతో ఈ అభ్యర్థనలను పరిగణించిన కేంద్రం దీనిపై చర్యలు చేపట్టింది.
ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం నుంచి అమ్మాయిలను కాపాడాల్సిన అవసరం వున్నందున 21 ఏళ్లుగా వివాహ వయస్సును పెంచాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.