నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

సిహెచ్

గురువారం, 6 మార్చి 2025 (23:07 IST)
మధుమేహం. ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. శరీరం సంకేతాలను చూపించినా చాలామంది దాన్ని కనుగొనలేకపోతున్నారు. నడక చేసేటపుడు ఇలాంటి సమస్యలు ఎదురయితే అది డయాబెటిక్ కావచ్చని అంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము.
 
కొద్ది దూరం నడవగానే తరచుగా కాళ్ల నొప్పులు వస్తుంటే డయాబెటిస్ సమస్యకు సంకేతం కావచ్చు.
డయాబెటిక్ ఫెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అయితే రక్తంలో చక్కెర ధమనులు గట్టిపడి తొడలు, పిరుదులలో నొప్పి వుండవచ్చు.
కాళ్లలో తిమ్మిర్లు, జలదరించినట్లు వుండటం మధుమేహం ప్రారంభ లక్షణం కావచ్చు.
రక్తంలో అధిక చక్కెర స్థాయిలు వుంటే చేతులు, కాళ్ల నరాలును దెబ్బతీయవచ్చు.
చేతులు మంట, సూదులతో గుచ్చినట్లు అనిపించడం వంటివి డయాబెటిస్ సూచనలు కావచ్చు.
డయాబెటిస్ కిడ్నీలపై ప్రభావం చూపడంతో పాదాలు, చీలమండలలో వాపు కనిపిస్తుంది.
నడిచిన తర్వాత మీరు వేసుకున్న బూట్లు బిగుతుగా నిపించినా, కాళ్లు వాచినట్లు కనిపించినా మధుమేహంగా అనుమానించాలి.
కొద్ది దూరం నడిచినా కూడా అలసిపోతున్నట్లు అనిపిస్తే డయాబెటిస్ సమస్యకు సంకేతం కావచ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు