కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

సిహెచ్

గురువారం, 3 ఏప్రియల్ 2025 (22:14 IST)
మూత్రపిండాల వ్యాధిని నివారించడానికి కొన్ని చేయవలసినవి, కొన్ని చేయకూడనివి ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
శరీరంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిక్‌గా మారవచ్చు.
శరీరానికి తగినంత నీరు అందకపోతే, అది మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
తగినంత నిద్ర పోకపోవడం వల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.
ధూమపానం, అతిగా మద్యం సేవించడం వల్ల మూత్రపిండాల వ్యాధి వస్తుంది.
మాంసాన్ని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో ఆమ్ల స్థాయి పెరిగి మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు