దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

సిహెచ్

సోమవారం, 31 మార్చి 2025 (15:54 IST)
ప్రపంచానికి మరో కొత్త భయం వెంటాడుతోంది. ఆమధ్య కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కొత్తగా రష్యాలో మరో కొత్త రకం వైరస్ వెలుగుచూసినట్లు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తులు వారాల తరబడి విపరీతమైన పొడిదగ్గుతో బాధపడటమే కాకుండా దగ్గు తీవ్రమైనప్పుడు గొంతు నుంచి రక్తం కక్కుకుంటున్నారట.
 
ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుందో ఇప్పటివరకూ తెలియరాలేదు. ఐతే వ్యాధి లక్షణాలు జ్వరంతో ప్రారంభమై రోగి క్రమేపి బలహీనమైపోతున్నాడు. దాంతోపాటు విడవని దగ్గుతో బాధపడుతూ రక్తం కక్కుకుంటున్నట్లు తెలుస్తోంది. రష్యాలోని పలు చోట్ల ఇలాంటి రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దగ్గుతో రక్తం పడటం, విపరీతమైన జ్వరంతో వస్తున్న రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో ఈ సమస్యకు కారణమేంటంటూ అధికారులను అప్రమత్తం చేసింది రష్యా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు