కాబట్టి శాశ్వత పిత్తం వంటి సమస్యలు రావచ్చు. వైద్యు నిపుణుల అభిప్రాయం ప్రకారం, భోజనానికి ఒక గంట ముందు, భోజనం తర్వాత ఒక గంట తర్వాత కాఫీ లేదా టీకి దూరంగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరంలో ఐరన్ తగ్గుతుంది. ఇది అలసట, బలహీనత వంటి వివిధ సమస్యలకు దారి తీస్తుంది.
అలాగే భోజనం చేసిన వెంటనే మద్యం తాగే అలవాటు కొంతమందికి వుంటుంది. అది శరీరానికి చాలా హానికరం. ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది వివిధ ప్రేగు సంబంధిత వ్యాధులకు కూడా కారణమవుతుంది. అందువల్ల, భోజనానికి ముందు లేదా తర్వాత కనీసం అరగంట పాటు మద్యం సేవించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.