యూరిన్ రంగును బట్టి.. వ్యాధులు పసిగట్టేయవచ్చు.. ఎలా?

మంగళవారం, 30 అక్టోబరు 2018 (15:34 IST)
మానవుడిలో వున్న వ్యవస్థ ఉత్పత్తి చేసే వ్యర్థ పదార్థాలలో మూత్రం ఒకటి. అసలు మూత్రం ఎలా వస్తుందంటే.. రక్తాన్ని కిడ్నీలు వడబోయగా అందులో ఉండే వ్యర్థ పదార్థాలు మూత్రంగా వస్తాయి. మనకు ఏర్పడే అనారోగ్య సమస్యలను నివారించేందుకు వైద్యులు మెుదటిగా చేసేది మూత్ర పరీక్ష మాత్రమే. ఇది ఇలా ఉంటే.. మూత్రం రంగును బట్టి మన శరీరంలోని వ్యాధులు తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
 
1. గులాబీ లేదా ఎరుపు రంగులో మూత్రం వస్తే మూత్ర పిండ వ్యాధులు, కణతులు, లివర్ వ్యాధులు, ప్రోస్టేట్ సమస్యలు వచ్చే ప్రమాదాలున్నాయి. అలాకాకుంటే ఎరుపు, పింక్ రంగులో ఉండే ఆహార పదార్థాలు అధికంగా తీసుకుంటే కూడా ఇలా ఉంటుంది. 
 
2. విటమిన్ ట్యాబెట్ల్స్, క్యాన్సర్ మెడిసిన్స్, డ్రగ్స్ ట్యాబ్లెట్ల్ వంటి వాడితే మూత్రం రంగు నీలం లేదా ఆకుపచ్చ రంగుగా ఉంటుంది. మూత్రం ఇలా వస్తే.. జన్యుపర వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
3. గోధుమ రంగులో మూత్రం వస్తే.. లివర్ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారని అర్థం. కనుక వెంటనే వైద్యున్ని సంప్రదించి తగు చికిత్సలు తీసుకోవడం మంచిది. 
 
4. ముదురు పసుపు, కమలా పండు రంగులో మూత్రం వస్తుంటే.. లివర్ వ్యాధులు ఉన్నాయని అర్థం. లేదా నీటిని తీసుకోవడంలో తేడాల వలన కూడా ఇలా ఉంటుంది. 
 
5. తేనె రంగులో మూత్రం ఉంటే.. డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదాలున్నాయి. లేదా నీరు తక్కువగా తాగడం వలన కూడా ఇలా ఉంటుంది. లేత పసుపు రంగులో మూత్రం ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు