ఇపుడు చెప్పులు వేసుకుని నడవడం ఓ ఫ్యాషనైపోయింది. ఆరు బయటే కాదు.. ఇంట్లో తిరిగే సమయంలో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతుంటారు. వీధులు లేదా రోడ్లపై చెప్పులు లేకుండా తిరగితే అదో వింతగా చూస్తారు. చెప్పులు లేకుండా నడిస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. రక్తప్రసరణ బాగా జరుగుతుందని వారు చెబుతున్నారు.
ముఖ్యంగా, చెప్పులు లేకుండా ఉత్త పాదాలతో నడిస్తే కాళ్లకు గాయాలు కావట. నడక స్థిరంగా ఉంటుందట. శరీర భంగిమ కూడా కరక్ట్‌గా ఉంటుందట. అంతేకాదు శరీరాన్ని సరిగా బ్యాలెన్స చేసుకోగలుగుతారట. అందుకే ఇంట్లో, ఆఫీసులో, ఆరుబయట చెప్పుల్లేకుండా హాయిగా తిరగమంటున్నారు శాస్త్రవేత్తలు.
ఇదే అంశంపై న్యూయార్కులోని ఇథాకా స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ హ్యూమన్ పెర్ఫామెన్స్‌కు చెందిన ప్రొఫెసర్ పాట్రిక్ మెక్‌కెన్ స్పందిస్తూ, కాళ్లలోని పాదాల్లోని చిన్న, పెద్ద కండరాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. వీటి గురించి న్యూరల్ కనెక్షన్ ద్వారా బ్రెయిన్‌కి సమాచారం చేరుతుంది.
పాదాలు, కాళ్లు, కండరాలు దృఢంగా పనిచేయాలంటే చెప్పుల్లేకుండా నడవాలి. ఇలా చేయడం వల్ల కండరాలు బలపడతాయి. వీటితోపాటు కండరాలు గట్టిపడడానికి రోజూ వ్యాయామం కూడా చేయాలి. కానీ చలికాలంలో మటుకు షూస్ లేకుండా ఉత్త కాళ్లతో నడవడం, పరిగెట్టడం రెండూ ఏమాత్రం మంచిది కాదు.