గర్భిణిగా ఉన్నప్పుడు, పసికందులకు పాలిచ్చే సమయంలో చేపలు తినటం వల్ల పిల్లల్లో ఆహారసంబంధం అలర్జీలు అస్తమా, ఎగ్జిమాలు తలెత్తే అవకాశాలు తగ్గుతాయంటున్నారు. పరిశోధకులు, పిల్లల మీద జరిపిన మరో పరిశోధనలో 11 నెలల వయస్సులోపే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే చేపలు, గుడ్లు తినిపించడం వల్ల అలర్జీలను నియంత్రించవచ్చని కూడా రుజువైంది. అలా చిన్న వయసులోనే ఈ ఆహారాన్ని అలవాటు చేయడం వల్ల వాళ్ల రక్తంలో ఒమేగా 3 లెవెల్స్ ఎక్కువగా ఉండి అలర్జీలను తట్టుకునే సామర్ధ్యం ఏర్పడుతుందంటున్నారు.
పరిశోధకులు పుట్టుకప్పుడు, నాలుగు నెలల వయస్సు పిల్లల్లో ఈ ఫ్యాటీ యాసిడ్ అత్యధిక పరిమాణాల్లో ఉన్నట్లు కూడా వారు గుర్తించారు. ఇందుకు కారణం గర్భణిగా ఉన్నప్పుడు, పాలిచ్చే సమయంలో స్త్రీలు చేపలు ఎక్కువగా తినటమే. ఇలా వారి శరీరం నుంచి పిల్లలకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అందుతోందని పరిశోధకులు గ్రహించారు. ఇదే పరిమాణాన్ని పిల్లలకు 11 నెలల వయసొచ్చే వరకూ కొనసాగించగలిగితే భవిష్యత్తులో అలర్జీ సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆవకాశాలు తగ్గుతాయంటున్నారు.