మన పూర్వీకులు రాగిపాత్రలను విరివిగా ఉపయోగించేవారు. ఆ కారణంగానే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. సుదీర్ఘకాలం పాటు జీవించారు. కానీ, నేటితరం మనుషులు నిరంతరం రోగాలతో యుద్ధం చేస్తున్నారు. చీటికీమాటికీ అనారోగ్యంపాలవుతున్నారు.
ప్రస్తుతం కనిపిస్తున్న ఆరోగ్య సమస్యలు ఆ కాలపు మనుషులను పెద్దగా బాధించేవి కావు. దీనికి కారణం వారి జీవనవిధానమే. అప్పట్లో ఎక్కువగా రాగి, ఇత్తడి పాత్రలు వాడటం వల్లే వారి ఆరోగ్యం అంత బేషుగ్గా ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు.
* ఇత్తడి పాత్రలను జింక్, అలాయ్ మిశ్రమంతో తయారు చేస్తారు.
* జింక్ వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతంది. అందుకే ఇత్తడి పాత్రల్లో నీటిని తాగవచ్చు. లేదా ఆ పాత్రల్లో వంట చేసుకుని తినవచ్చు.
* రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల అసిడిటీ, అజీర్ణం, డయేరియా, కామెర్లు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.