ఒక్క ఆకుతో ఆ రోగాలు మటుమాయం.. ఏంటది?

బుధవారం, 30 జనవరి 2019 (11:17 IST)
గోంగూరలో ఉన్న పోషకాలు ఇక దేంట్లోను ఉండవంటున్నారు వైద్య నిపుణులు. తెలుగునాట గోంగూరకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ఆంధ్రమాతగా ఆరాధిస్తారు. ఇష్టంగా భుజిస్తారు. పచ్చడి వేసుకున్నా.. పులుసుగా తిన్నా గోంగూర రుచి మరి దేనికి ఉండదంటారు. పెళ్ళయినా, పేరంటమైనా, ఏ శుభకార్యం జరిగినా గోంగూర చేయాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే గోంగూరతో తెలుగువాడి జీవనం ముడిపడిపోయింది.
 
ప్రతిరోజు గోంగూర తినడం వల్ల కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సితో పాటు పీచు పదార్థాలు ఉండడంతో ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. అరుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందట. అంతేకాదు గోంగూరలో ఉన్న గుణాలు శరీరంలోని పెద్దపెద్ద గడ్డలను తగ్గించే గుణాలుంటాయట. గోంగూర ఆకులను ఆముదంతో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసి గడ్డలపై పూతగా పూస్తే వాపులన్నీ ఇట్టే తగ్గిపోతాయట. అంతటి మహత్తర గుణం గోంగూరలోనే ఉందట.
 
రేచీకటి పోవడానికి గోంగూర బాగా పనిచేస్తుందట. అంతేకాదు బోదకాలుతో బాధపడేవారికి ఉపశమనంగా పనిచేస్తుందట. కొన్ని సీజన్లలో వచ్చే వ్యాధులను కంట్రోల్ చేస్తుంది. దగ్గు, తుమ్ములు, జలుబు, ఆయాసం వంటి సమస్యలు ఉంటే పూర్తిగా తగ్గిపోతాయట. ఇలా ఎన్నో ఔషధ గుణాలు ఒకే ఒక్క గోంగూరలో ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు