టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నాలు త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. వీరి నిశ్చితార్థం శుక్రవారం హైదరాబాద్ నగరంలో జరిగింది. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్న విషయంతెల్సిందే.
ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల అంగీకారంతో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన నిశ్చితార్థ వేడుకలో ఇరు కుటుంబాలు, కొద్ది మంది బంధువులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ సన్నిహితులు తెలిపారు. అయితే, వీరిద్దరి వివాహం వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో జరుగనుంది.
కాగా, 'గీత గోవిందం' సినిమాలో కలిసి నటించిన వీరు హిట్ పెయిర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డియర్ కామ్రేడ్‌లోనూ నటించారు. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్టు పలుమార్లు వార్తలు రాగా తాము స్నేహితులం మాత్రమేనని చెబుతుండేవారు. అయినా పలు వేడుకలకు కలిసి వెళ్లడంతో రూమర్స్ వస్తూనే ఉండేవి. ఇప్పుడు అభిమానులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చినట్టైంది.