అనారోగ్య సమస్యలను దూరం చేసే ఉసిరికాయ

మంగళవారం, 24 అక్టోబరు 2017 (10:59 IST)
వ్యాధి నిరోధక శక్తిని పెంచి.. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే రోజుకో ఉసిరికాయ తీసుకోవడం మంచిది. ఉసిరికాయలో లభించే విటమిన్‌ ‘సి’ మరి ఏ పండులోనూ లభించదు. ఉసిరికాయ ఆకలిని పెంచుతుంది. వివిధ అలర్జీలతో బాధపడే వారు ఒక చెంచా ఉసిరిరసంలో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే త్వరిత ఉపశమనం లభిస్తుంది. హృద్రోగ వ్యాధులను, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
 
ఉసిరికాయను నిత్యం ఆహారంలో తీసుకుంటే తల వెంట్రుకలు త్వరగా తెల్లబడవు, చర్మం మృదువుగా మారుతుంది. కీళ్ల నొప్పులు, దంత సంబంధిత సమస్యలు ఎదురుకావు.  చర్మ సమస్యలున్న వారు ఉసిరి రసాన్ని చర్మంపై రాసుకుంటే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఉసిరికాయ పొడిని, శనగ పిండిలో కలిపి శరీరానికి రాసుకుని తరువాత స్నానంచేస్తే చర్మ కాంతి పెరుగుతుంది. వీటిని తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు