బత్తాయిరసంలో చిటికెడు బ్లాక్ సాల్ట్ కలిపి చిగుళ్లపై రాస్తే?

ఆదివారం, 22 అక్టోబరు 2017 (13:25 IST)
డయేరియా వల్ల కలిగే అలసటకీ నీరసానికీ బత్తాయిరసం ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బత్తాయి రసం రక్తవృద్ధికీ, వీర్యవృద్ధికీ కూడా తోడ్పడుతుంది. నరాలమీద ఒత్తిడినీ తగ్గిస్తుంది. బత్తాయి రసంలో జీలకర్ర, అల్లంపొడి వేసుకుని తాగితే ఆస్తమా కారణంగా దగ్గుతో బాధపడేవాళ్లకి ఉపశమనంగా ఉంటుంది. ఇందులోని విటమిన్లు జుట్టుపెరుగుదలకీ చర్మ సౌందర్యానికీ దోహదపడతాయి.
 
బత్తాయిలో పుష్కలంగా ఉండే విటమిన్-సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. చిగుళ్లనుంచి రక్తం కారుతుంటే బత్తాయిరసంలో చిటికెడు బ్లాక్ సాల్ట్ కలిపి రాస్తే వెంటనే ఫలితం ఉంటుంది. రోజూ బత్తాయి రసం తీసుకుంటే, చర్మం మీదున్న మచ్చలు తొలగిపోయి నిగారింపు వస్తుంది.
 
బత్తాయిలోని లిమోనాయిడ్స్‌ ఊపిరితిత్తులను శుభ్రపరుస్తాయి. గొంతు ఇన్‌ఫెక్షన్లకు గొప్ప ఔషధంగా ఈ పండు రసం పనిచేస్తుంది. జాండిస్ నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న వారి శక్తిహీనతను, నీరసాన్నీ పోగొట్టి త్వరితంగా ఆరోగ్యవంతులు కావడానికి బత్తాయి రసం సహకరిస్తుంది. బత్తాయి రక్తపోటును నియంత్రిస్తుంది. గుండెకు బలాన్నిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు