అవి తినేస్తున్నారా? మేలు చేస్తుందో లేదో చెక్ చేసుకోండి...
సోమవారం, 4 మార్చి 2019 (18:28 IST)
మనం అనేక రకములైన పదార్థాలను తింటాము. అవి మన శరీరానికి మేలు చేస్తాయో లేదో అనే విషయం దాదాపుగా పట్టించుకోము. కానీ కొన్ని రకాల పదార్దాలను మన ఆహారంలో భాగంగా చేర్చుకోడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అవేంటో చూద్దాం.
1.టొమాటో : దీనిలోని లైకోపిన్ కాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె , రక్తనాళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాలనుండి రక్షించడములో మిగతా పోషకాలతో పాటు టమాటోల పాత్ర చెప్పుకోదగినదే .
2. గింజ ధాన్యాలు : ముఖ్యముగా వాల్ నట్స్ లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , ప్లాంట్ స్టెరోల్స్ సమృద్ధిగా ఉంటాయి . కొలెస్టరాల్ లెవల్ తగ్గించడంలో వీటి పాత్ర అమోఘం. వాల్నట్స్ పీచుపదార్థము. ఇందులో మెగ్నీషియం, కాపర్, ఫోలేట్, విటమిన్-ఇ ఉండి శక్తివంతమైన యాంటి ఆక్షిడెంట్స్‌ని శరీరానికి అందిస్తాయి. బ్లడ్ ప్రషర్ తగ్గిస్తుంది. ఆస్టియోపొరోసిస్ రాకుండ ఆపుతుంది. గుండె ఆరోగ్యాన్ని, చర్మానికి ఎండనుండి కలిగే హాని నుండి కాపాడుతుంది .
3. నిజానికి టీ ఓ సూపర్ డ్రింక్. బ్లడ్ ప్రెషర్ని కొంత తగ్గిస్తుంది. ఆస్టియోపొరోసిస్ రాకుండా ఆపుతుంది, గుండె ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. చర్మానికి ఎండచేసే హానిని నిరోధిస్తుంది. చర్మాన్ని అంత త్వరగా ముడతలు పడనివ్వదు. కళ్ళకు మెరుపు అందిస్తుంది. కేటరాక్ట్ ముదరటాన్నీ నెమ్మదింపచేస్తుంది.
4. పెరుగు... ప్రోటీన్,కాల్షియం, విటమిన్-బి లను అందిస్తుంది. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్పెక్షన్ కలగకుండా పోరాడతాయి. పైగా క్యాన్సర్, ఎలర్జీలు, అధిక రక్తపోటు, హై-కొలెస్ట్రాల్ బారిన పడకుండా కాపాడుతుంది.
5. బీన్స్ : ప్రోటీన్స్, పీచుపదార్ధము, విటమిన్లు, మినరల్స్, ఫైటో న్యూట్రియెంట్స్ ... ఇవన్నీ బీన్స్ లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు. క్యాన్సర్ రాకుండా తోడ్పడుతాయి . డయాబెటీస్‌తో పొరాడుతాయి . . సుగర్ లెవల్స్ సమతుల్యముగా ఉండేటట్లు చూస్తూనే సురక్షితమైన, నిలకడ అయిన నెమ్మదిగా ఖర్చయ్యే శక్తిని అందిస్తాయి. బీన్స్ తో చేసిన కూరలు తిన్నప్పుడు కడుపు నిండి నట్లు ఉంటోంది గాని అధిక క్యాలరీలు లేకపోవడం వలన బరువు పెరిగే సమస్యే ఉండదు.
6. ముఖ్యంగా నేరేడుపండ్లు వృద్దాప్యము త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్నకొద్దీ మెదడు నెమ్మదించే అవకాశమున్నది. అలాంటి అనారోగ్యల నుండి కాపాడుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి.
7. ఆకుకూరలు : బ్రొకోలి లాంటి ఆకుకూరలు చాలా రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతాయి. వీటిలో విటమిన్ బి, సి, ఇ, ఫొలేట్, పొటాషియం, సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి ఇవి అమోఘమైనవి. ఆకుకూరలు కాల్షియంని శరీరం ఇముడ్చుకోవటానికి తోడ్పతాయి. వృద్ధాప్యములో వచ్చే కేటరాక్ట్‌లను నిరోధించడములో స్పినాచ్ తోడ్పడుతుంది.