రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

సెల్వి

శనివారం, 19 జులై 2025 (13:17 IST)
Man
రాజస్థాన్‌లోని అజ్మేర్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. ఖ్వాజా గరీబ్ నవాజ్‌ దర్గా ప్రాంతాన్ని వరద నీరు చుట్టుముట్టింది. శుక్రవారం రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్‌లు విధించబడ్డాయి. 
 
రాజ్‌సమంద్ జిల్లాలోని కుంభాల్‌గఢ్ ప్రాంతంలో, పెరుగుతున్న నీరు రోడ్డును అడ్డుకోవడంతో అనేక మంది పిల్లలను తీసుకెళ్తున్న స్కూల్ వ్యాన్ చిక్కుకుపోయింది. స్థానిక నివాసితులు వేగంగా చర్య తీసుకోవడం వల్ల పిల్లలందరినీ మరో ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా రక్షించగలిగారు.
 
అలాగే ఇరుకు సందుల్లోకి ఆకస్మికంగా వరద నీరు రావడంతో ఓ వ్యక్తి కొట్టుకపోయాడు. వెంటనే అక్కడ హోటల్‌లోని ఒక వ్యక్తి ధైర్యంగా ముందుకువచ్చాడు. చేయితో అతడిని పట్టుకుని, ఇతరుల సహాయంతో పైకి లాగాడు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Heavy rain on Friday night left the area around Ajmer’s Khwaja Garib Nawaz Dargah waterlogged. A devotee slipped in the strong current near the Nizam Gate, but was rescued just in time by a hotel staffer. The incident caused brief chaos in the area. #ajmerrain #AjmerNews #Floodpic.twitter.com/7otNIu2TnE

— PRATEEK BAJPAI (@prateekbajpai07) July 19, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు