తన జోలికి వచ్చిన వారు ఎవరు కూడా బాగుపడలేదన్నారు రోజా. తన పిల్లల్ని కూడా వదల్లేదన్నారు. తన పిల్లలకు కూడా న్యూడ్ ఫోటోలు పంపుతున్నారని రోజా వాపోయారు. ఈ వేధింపులు భరించలేక తన కూతురు ఫారిన్ వెళ్లిపోయిందని.. పిల్లల బర్త్ డే పుట్టిన రోజు వేడుకలు చేస్తే కూడా సోషల్ మీడియాలో కూడా కింద కామెంట్స్ చూస్తే అన్ని బూతులేనన్నారు. తాను పట్టుదల గల మనిషినే కాబట్టే రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు.
ఇకపోతే... ఇసుక, బియ్యం స్మగ్లింగ్‌తో రోజాతో పాటు ఆమె సోదరులకు, భర్తకు సంబంధం లేదని కాణిపాకం గుడికి వచ్చి ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సవాల్ విసిరారు. రూ.12 వేల అద్దె ఇంటినుంచి ఇప్పుడు ఊరికో ఇంటిని నిర్మించుకునే స్థాయికి రోజా ఎదిగిందని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలను రోజా తప్పుబట్టారు. అంతేకాకుండా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి దారుణంగా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రెండు వేల రూపాయలు ఇస్తేనే ఏపనైనా చేస్తానని.. ప్రస్తుతం కోట్లాది రూపాయలు చేస్తుందని ట్రోల్స్ చేస్తున్నట్లు రోజా ఫైర్ అయ్యారు.