బాదంను స్నాక్స్‌గా తీసుకుంటే.. మధుమేహం పరార్

శుక్రవారం, 6 డిశెంబరు 2019 (13:35 IST)
బాదంను స్నాక్స్‌గా తీసుకుంటే.. శరీరానికి శక్తి అందుతుంది. 2.5 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అందుతాయి. వీటిలో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్, ప్రొటీన్లు, ముఖ్య పోషకాలు ఉంటాయి. బాదం గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా ఇవి కాపాడతాయి.
 
కణాలు దెబ్బతినడం ద్వారా త్వరగా వృద్ధాప్యం దరి చేరడంతోపాటు జబ్బుల బారిన పడతారు. స్మోకింగ్ చేసేవారు బాదం గింజలు తింటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది.
 
రక్తంలోని చక్కెర స్థాయిలను బాదం నియంత్రిస్తుంది. వీటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  బాదం తినడం వల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. ఇంకా రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించుకోవచ్చు. ఫలితంగా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు