చలికాలంలో అనారోగ్య సమస్యలు, చిట్కాలు

గురువారం, 5 డిశెంబరు 2019 (22:22 IST)
శీతాకాలంలో చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్య శ్వాసకోస సంబంధిత సమస్య. బయట వాతావరణం చల్లగా వుండటంతో వెంటనే జలుబు, దగ్గు పట్టుకుంటాయి చాలామందికి. ఇలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే సమస్యను అధిగమించవచ్చు.
 
1. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే, శ్వాసకోశ వ్యాధులను దూరం చేసుకోవాలంటే బార్లీ గంజిని తయారు చేసుకుని దానిని వడగట్టి అందులో తేనె కలిపి తీసుకుంటే సమస్య తగ్గుతుంది.  
2. తేనెను దానిమ్మ రసంతో కలుపుకుని రోజూ తీసుకుంటే గుండెపోటు సమస్యలు దరిచేరవు. 
3. చేపనూనెతో తేనెను కలుపుకుని తీసుకుంటే చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.  
4. జీలకర్రను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి అందులో తేనె కలుపుకుని తాగితే మోకాళ్ల నొప్పిని దూరం చేసుకోవచ్చు.
5. తేనెను పరగడుపున వేడి నీటితో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. శరీరం దృఢంగా తయారవుతుంది. 
6. నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతుంది. 
7. తేనెతో ఉల్లిపాయల రసాన్ని కలిపి తీసుకుంటే కంటి దృష్టి మెరుగుపడుతుంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు