స్పూను మిరియాల పొడిని ఆవ నూనె వేసి వేడి చేసి మృదువుగా అక్కడ రాస్తే...
మంగళవారం, 3 డిశెంబరు 2019 (22:14 IST)
కండరాల నొప్పులు, కీళ్ళనొప్పులు ఉన్న ప్రాంతంలో ఒక టేబుల్ స్పూను మిరియాల పొడిని ఆవ నూనె వేసి వేడిచేసి మృదువుగా రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు తగ్గుతుంది.
నిద్రలేమితో బాధపడుతుంటే పడుకోబోయే ముందు పదిహేను నిమిషాలసేపు పాదాలను, అరిపాదాలను ఆముదంతో మర్ధన చేయాలి.
మజ్జిగలో కొంచెం పసుపు, కాస్త ఉప్పు కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి.
వేయించిన వాముని ఉండలా చేసి పలుచని గుడ్డలో పెట్టి దానిని తలనొప్పి తగ్గేదాక ముక్కు దగ్గర పెట్టుకొని వాసన పీలిస్తే తలనొప్పినుండి విముక్తి కలుగుతుంది.
కప్పు నీటిలో కొద్దిగా మిరియాల పొడి వేసి చిన్నమంటపై మరిగించాలి. ఈ నీరు గోరువెచ్చగా అయ్యాక కాసిన్ని నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించాలి ఇలా చేస్తే పంటినొప్పి తగ్గుతుంది.