చర్మసౌందర్య సాధనాలలో బాదంను విరివిగా వాడుతారు. చర్మకాంతిని సంతరించుకోవాలంటే.. రాత్రి పాలలో నానబెట్టిన బాదం పప్పుల్ని ఉదయాన్నే పేస్టు చేసి.. ముఖానికి రాసుకుని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం తళతళ మెరిసిపోతుంది. అలాగే జుట్టు రాలుతుంటే.. వారానికి ఓసారైనా బాదం నూనెను తలకు పట్టించాలి.