లవంగ నూనెను పొట్ట రాస్తే...

సోమవారం, 2 జులై 2018 (09:34 IST)
వంటింట్లో లభ్యమయ్యే వంట దినుస్సుల్లో లవంగాలు ఒకటి. వీటివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఓసారి పరిశీలిస్తే, 
 
* లవంగనూనెను పొట్టపై రాస్తే జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయని మనదేశీయులు భావిస్తారు. 
* లవంగాలను చైనీయులు వెక్కిళ్ల నివారణా ఔషధంగా ఉపయోగిస్తారు. 
* లవంగ నూనెతో తామరలాంటి చర్మ సంబంధ వ్యాధులు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు నివారించవచ్చు. 
* పంటినొప్పిని నివారించటంలోనూ లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయి. 
* గొంతునొప్పి, జలుబులను తగ్గించేందుకు లవంగాల కషాయం దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
* ఉబ్బసం, దగ్గు, నులిపురుగులను తగ్గించే గుణం కూడా వీటికి మెండుగా ఉంది. 
* వాంతి అవుతుందని అనిపిస్తుంటే.. నాలుగు చుక్కల లవంగనూనెను తాగితే ఫలితం ఉంది. 
* అలసటను, రుమాటిక్ నొప్పులను తగ్గించటంలో కూడా లవంగాలు బాగా తోడ్పడుతాయి. 
* లవంగాలతోపాటు దంత సంబంధ సమస్యలు తగ్గించటంలో ఉపయోగపడతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు