అరటి పువ్వును వారంలో రెండుసార్లు వంటల్లో చేర్చుకుంటే..

శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (17:03 IST)
అరటి పువ్వును వారంలో రెండుసార్లు వంటల్లో చేర్చుకుంటే.. రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. శరీరంలో కొవ్వు తగ్గిపోతుంది. రక్తహీనత దూరమవుతుంది. అల్సర్‌కు చెక్ పెడుతుంది. వారానికి ఐదు రోజూలు అరటిపువ్వులతో తయారయ్యే వంటకాలను తీసుకోవడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. 
 
అలెర్జీ, విరేచనాలు, నోటిపూత, నోటి దుర్వాసన వంటి రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. మహిళల్లో ఏర్పడే గర్భాశయానికి సంబంధించిన రోగాలు, నెలసరి సమస్యలను అరటి పువ్వు నయం చేస్తుంది. అరటిపువ్వును కూరల్లో మాత్రమే ఉపయోగించకుండా.. వెరైటీగా వడలు, కట్ లెట్, పకోడాలను తయారు చేసుకుని తీసుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి