రోజూ ఓ అరటి పండు తినండి... ఆరోగ్యంగా ఉండండి..

ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (16:55 IST)
ప్రతిరోజూ ఓ అరటి పండు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చునని.. అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ప్రతిరోజు అరటి పండు తినడం వలన ఇందులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్ ని ఎక్కువ చేసి అనీమియాను రాకుండా చేస్తుంది. 
 
అరటి పండులో విటమిన్స్,మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది. అంతేగాకుండా ఫైబర్ ఉండటం ద్వారా హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అసిడిటీని నయం చేసుకోవచ్చు. 
 
అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండటంవలన బ్లెడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. ఇందులో ఎక్కువగా విటమిన్స్ ఉండటం వలన కంటి చూపుకు కూడా చాలా పనిచేస్తుంది. ఈ పండు తినడం వలన జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి