అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు.. బరువుకు చెక్ పెట్టాలంటే..

గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:53 IST)
అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలెన్నో వున్నాయి. ప్రతిరోజూ అరటి తింటే రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుంది. ఎర్రరక్తకణాలో ఇనుము శాతాన్ని పెంచి రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. 
 
ఎర్రరక్తకణాలు పెరగడంతో పాటు ఐరన్‌ను పెంపొందించి శరీరానికి రక్త ప్రసరణ సజావుగా జరుపుతుంది. ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. 
 
సహజంగా బరువు కోల్పోవాలనుకునే వారు అరటి పండు తీసుకుంటే మంచిది. ఇది ఆకలిని నియంత్రించి వేళకు మితంగా భోజనం తీసుకునేలా అరటి మనల్ని ప్రేరేపిస్తుంది. అరటి పండ్ల ద్వారా లభించే పొటాషియం మిమ్మల్ని గుండె సంబంధిత సమస్యలకు దూరం చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు