ఎముకలు దృఢంగా ఉండాలంటే బీన్స్ తీసుకుంటే ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీన్స్‌లో విటమిన్ బి6, థయామిన్, విటమిన్ సి ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఎముకలకు మంచి బలం చేకూర్చుతుంది. బీన్స్‌లో క్యాన్సర్ కారకాలపై పోరాడే ధాతువులు పుష్కలంగా ఉన్నాయి.
అలాగే ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరచుటలో చాలా మంచి ఫలితాలను కలిగిస్తాయి. వారానికి రెండుసార్లు బీన్స్ తీసుకుంటే మధుమేహం వ్యాధి నుండి తప్పించుకోవచ్చును. బీన్స్‌లో పీచు, విటమిన్ ఏ, కే, కోలెడ్, మెగ్నిషియం వంటివి ఉండటం వలన రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గించుటకు సహాయపడుతుంది. విటమిన్ ఏ కంటిచూపు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వాయుసంబంధిత రోగాలను దూరం చేస్తుంది.