మధుమేహ వ్యాధిగ్రస్తులు రుచితో రాజీపడకుండా చిరుధాన్యాలైన రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామలు, అరికలతో చేసిన ఇన్‌స్టెంట్ టిఫిన్స్, స్నాక్స్, కిచిడీలు తయారు చేసుకుని తీసుకోవచ్చు. తద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది. చిరుధాన్యాల్లో ప్రొటీన్ శాతం ఎక్కువ. ఫలితంగా గుండెజబ్బుల నివారణకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయి. చిరుధాన్యాల మూలంగా ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు తగ్గుతాయి. వీటిల్లోని మెగ్నీషియం పార్శ్వ నొప్పి, గుండెపోటు ముప్పు తప్పడానికి తోడ్పడుతుంది. అలాగే నియాసిన్ కొలెస్ట్రాల్ తగ్గేలా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.