ఆహారం తీసుకున్న వెంటనే నిద్రిస్తున్నారా? అయితే పొట్ట తగ్గదు.. బోర్లా పడుకుంటే?

శనివారం, 3 డిశెంబరు 2016 (14:23 IST)
మధ్యాహ్నం భోజనమో లేకుంటే రాత్రి పూట ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించే అలవాటుంటే ఇక మానుకోండి. ఎందుకంటే ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించడం ద్వారా పొట్ట బాగా పెరుగుతుంది. అందుకే ఆహారం తీసుకున్న గంట లేదా రెండు గంటల తర్వాతే నిద్రించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే రోజుకు కనీసం 8 గంటల పాటు నిద్రించాలి. నిద్రించేటప్పుడు బోర్లా పడుకుంటే.. పొట్టలోని కొవ్వు కరుగుతుంది. 
 
పొట్ట తగ్గాలంటే.. సాల్ట్ తక్కువగా తినాలి. బీపీ ఉన్నవారు ఉప్పును బాగా తగ్గించాలి. సాల్ట్ ఎక్కువగా తింటే ఫ్యాట్ పెరుగుతుంది. అలాగే శ్వాస లోతుగా పీల్చడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజు శ్వాసకు సంబందించిన వ్యాయామాన్ని చేయాలి. శరీరంలోని టాక్సిన్స్ తొలగింపబడి, బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే నీరు అధికంగా కలిగిన ఆహారం తీసుకోవాలి. వాటర్ మెలోన్, పీయర్స్ వంటివి తింటే మంచిది.
 
పొట్ట పూర్తిగా తగ్గాలంటే.. జంక్ ఫుడ్, ఫ్రై ఐటమ్స్, చిప్స్ ఇలాంటివి కచ్చితంగా తీసుకోకూడదు. వీటికి ఎంత దూరంగా ఉంటే మంచిది. ఇక ఎక్కువగా నీరు తాగాలి. ఎక్కువగా నీరు తాగడం ద్వారా పొట్టను తగ్గించుకోవచ్చు. కానీ రాత్రిపూట 9 గంటలకు పైగా నీరు తాగడాన్ని కాస్త తగ్గించాలి. ఆహారాన్ని హడావుడిగా కాకుండా నెమ్మదిగా తినాలి. నెమ్మదిగా తినడం వలన తక్కువ తినొచ్చు. తద్వారా కొవ్వు తగ్గి బరువు కూడా తగ్గొచ్చు. 
 
పొట్టకు సంబంధించిన వ్యాయామాలతో పాటు రోజూ అరగంట నడవండి. నడక అన్నిటికీ మేలు చేస్తుంది. ప్రతి రోజు కొంచెం దూరమైన నడవడం వలన పొట్ట తగ్గడమే కాకుండా, కాళ్ళు కూడ సన్న పడతాయని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి