తమలపాకు బరువును తగ్గిస్తుంది.. నోటి దుర్వాసన పరార్

సెల్వి

బుధవారం, 21 ఆగస్టు 2024 (22:54 IST)
తమలపాకులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకు ఆకుల్లో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. 
 
తమలపాకు గొంతు వ్యాధులకు, దంత ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తమలపాకు గుండె సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. అలాగే తమలపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. 
 
తమలపాకులు బరువు తగ్గించడంలో కూడా సహాయపడతాయి. తమలపాకు నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తమలపాకుల్లో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. 
 
ఇవి నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. ఇన్ఫెక్షన్లు, నోటి దుర్వాసనను నివారిస్తాయి అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు