కరివేపాకు తరచూ తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం ముప్పు నుంచి బయటపడొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది శరీరంలోని చెడు కొవ్వును నియంత్రించి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. డయాబెటిస్ తగ్గిస్తుందని వైద్యులు చెప్తున్నారు.
అలాగే గ్యాస్ట్రో వంటి తీవ్రమైన సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కరివేపాలో యాంటీ ఆక్సిడెంట్లు సహా వివిధ రకాల ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. నికోటిన్ ఆమ్లంతో పాటు విటమిన్లు ఏ, బి, ఈ ఉంటాయి.