నానబెట్టిన బాదం పప్పులను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. నరాలను బలపరిచే నియాసిన్ ఉప్పు ఇందులో ఎక్కువగా ఉంది. పీచు పుష్కలంగా ఉంది. తద్వారా హృద్రోగ వ్యాధులు దూరమవుతాయి. ఆకలి అధికంగా వుంటేవారు రోజు పది బాదం పప్పులను తినడం చేస్తే ఫలితం ఉంటుంది. బాదంను నీటిలో నానబెట్టి తీసుకోవడం ద్వారా లిబేస్ అనే పోషకాలు విడుదలవుతున్నాయి. దీన్ని తింటే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా వుంటుంది.
బాదంలో మెదడును, కిడ్నీలను రక్షించే ఫాస్పరస్, క్యాల్షియంలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో క్యాల్షియం 30 ఏళ్లు దాటిన మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. బాదం పప్పుల్లోని ఫోలిక్ యాసిడ్ గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.