తెల్ల వెంట్రుకలకు చెక్ పెట్టాలా? నల్లనువ్వుల నూనె లేదా ఆవనూనెతో మసాజ్ చేసుకోండి

బుధవారం, 5 అక్టోబరు 2016 (17:07 IST)
మీకు చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయా..? దీంతో జుట్టుకు రంగు వేసుకోవడంపై ఆధారపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి.

రెండు టేబుల్‌ స్పూన్ల హెన్నా పౌడర్‌ను, ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు, ఒక టేబుల్‌ స్పూన్‌ మెంతిపొడి, టేబుల్‌ స్పూన్‌ కాఫీ పొడి, రెండు టేబుల్‌ స్పూన్ల పుదీనా రసం, రెండు టీ స్పూన్ల తులసి రసం తీసుకుని ఈ మిశ్రమాలను చక్కగా కలిపి దీన్ని ఒక గంటపాటు అలాగే ఉంచి తర్వాత తలకు పట్టించుకోవాలి. 
 
ఒక గంటపాటు దీన్ని తలపైనే ఉంచుకుని తర్వాత నేచురల్‌ షాంపూతో చక్కగా తలస్నానం చేస్తే కాస్త మెరుగుపడుతుంది. ఇలా కనీసం నెలకు ఒకసారి చేసినా సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చు. అలాగే అల్లం రసాన్ని, తేనెను సమపాళ్లలో కలిపి రోజుకు ఒక టీస్పూను చొప్పున ఉదయం పూట తీసుకోవాలి. అలాగే విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఉసిరి, ఇంకా ఆకుకూరలు, ఐరన్‌ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు, విటమిన్‌ ఇ ఉండే చేప ఉత్పత్తులను ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. 
 
అప్పుడప్పుడు తలకు నూనెతో మసాజ్‌ చేయించుకోవాలి. దీనివల్ల వెంట్రుకల కుదుళ్లు గట్టిపడతాయి. మసాజ్‌కు నల్లనువ్వుల నూనెగానీ, లేదా ఆవనూనెగానీ ఉపయోగించాలి. ఇలా చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే వెంట్రుకలు తెల్లబడడాన్ని నివారించడంతోబాటు జుట్టు పొడిబారడం వంటి సమస్యకు చెక్ పెట్టవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి