వేసవి కాలంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోకపోతే.. అనారోగ్య సమస్యలతో పాటు వడదెబ్బకు గురయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో అతిగా బయట తిరగడం.. అతిగా తినడం తగ్గించాలి. వేసవిలో ప్రత్యేక దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులు అన్నింటికంటే బెటర్. పాలిస్టర్, టెరీకాటన్, పట్టునైలాన్, షిఫాన్ వంటితో తయారయ్యే దుస్తులను అస్సలు ధరించకూడదు.
ఇంకా వేసవిలో బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది కాదు. వేసవిలో ఎక్కడైనా ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు ముదురురంగు వస్త్రాలను, దుస్తులనుగానీ ఉపయోగించరాదు. లేత రంగు లేదా తెలుపు రంగులను ధరిస్తే ఎండ వేడిని గ్రహించుకోవు కాబట్టి వాటిని ఉపయోగించడం మంచిది.
ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవాలంటే బాదం మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటివి తీసుకోవచ్చు. మజ్జిగనీళ్ళు, పచ్చి ఉల్లిపాయలు మేలు చేస్తాయి. తేనె కలిపిన నిమ్మరసం వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో రెండుపూటలా చన్నీళ్ళ స్నానం చేయాలి. ఇలా చేస్తే వేసవిలో చికాకు తప్పుతుంది.