ద్రాక్షపండ్లను తీసుకుంటే బరువు తగ్గుతారట...

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (10:59 IST)
ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా శరీరంలోని కొవ్వును ఏర్పడకుండా చూస్తుంది. నల్లద్రాక్షల్లో వుండే అడిపోస్ టిష్యూ.. చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. అందుకే ప్రతి రోజ యాభై గ్రాముల ద్రాక్షను క్రమం తప్పకుండా తింటే ఊబకాయం సమస్య నుంచి బయటపడవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ద్రాక్ష పండ్లు కొలెస్ట్రాల్ నిల్వలను బాగా తగ్గిస్తాయి. శరీర కణజాలాల్లోకి నేరుగా చొచ్చుకునిపోయే గుణం ద్రాక్ష రసానికి ఉంది. 
 
ద్రాక్ష పండ్లలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, సోడియం, డైటరీ ఫైబర్‌, ఏ, సి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండ్లకు పక్షవాతం రాకుండా నిరోధించే గుణం కూడా ఉంది. ప్రత్యేకించి ఎరుపు తొక్కతో ఉండే ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి గుండె సంబంధిత రుగ్మతలను కేన్సర్‌ వంటి వ్యాధులను అడ్డుకుంటాయి.
 
అలాగే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపే గుణం ద్రాక్షల్లో మెండుగా వున్నాయి. అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొనే వాళ్లు రోజూ ద్రాక్ష పండ్లు తింటే కొద్ది రోజుల తర్వాత మాత్రల అవసరం లేకుండానే రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఉప్పు అతిగా తినే అలవాటు వల్ల వచ్చే అధిక రక్తపోటు కూడా ద్రాక్ష పండ్లు తింటే తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు