జీలకర్ర ద్వారా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలంటే రోజూ జీలకర్రను నీటిని తీసుకోవాల్సిందే. జీలకర్ర తినడం వలన శరీరంలోని క్యాలరీలు కరిగిపోతాయి. పొట్ట తగ్గుతుంది. జీర్ణశక్తిని మరింతగా పెంపొందుతుంది. క్రమం తప్పకుండా జీలకర్ర నీటిని తీసుకోవడం ద్వారా చాలామటుకు బరువు తగ్గే అవకాశముంది. అలాగే పొట్టలో పేరుకుపోయిన కొవ్వు కూడా సునాయాసంగా కరిగిపోతుంది.
జీలకర్రతో పాటు అల్లం, నిమ్మ రసాన్ని కలిపి తీసుకోవచ్చు. దీని ద్వారా మరింత త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. అల్లం తరుగు, జీలకర్ర పొడి, నిమ్మరసం కలిపి సూప్‌లా తయారు చేసుకుని రాత్రి నిద్రించేందుకు ముందు తీసుకుంటే బరువు తగ్గవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ సూప్ తాగిన పావు గంట వరకు ఏమీ తినకుండా వుండాలని వారు సూచిస్తున్నారు.