మార్కెట్‌లో లభించే బియ్యంలో బ్లాక్ రైస్ అత్యంత ఆరోగ్యకరమైన రకమని వైద్య నిపుణులు చెపుతారు. ఇవి అపారమైన పోషకాలను కలిగి వుంటాయనీ, వీటితో విస్తృతమైన ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయని అంటున్నారు. బ్లాక్ రైస్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల శరీరంలోని దాదాపు ప్రతి భాగానికి ప్రయోజనం చేకూరుతుంది. కళ్ళు, గుండె, శ్వాసకోశ వ్యవస్థ, కాలేయానికి ఆరోగ్యకరమైనది. వృద్ధాప్య లక్షణాలను కూడా త్వరగా దరిచేరనీయదు.
ప్రతిరోజూ బ్లాక్ రైస్ తినవచ్చు, ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వు లేదా కొలెస్ట్రాల్ కంటే ఫైబర్- న్యూట్రీషియన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున ప్రతిరోజూ బ్లాక్ రైస్ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. అలాగే ఇది పెద్దలకు మంచి శక్తి వనరు.