హాయిగా నిద్రపోవాలంటే.. బ్రౌన్ రైస్‌ను తీసుకోండని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బ్రౌన్ రైస్ నాణ్యమైన నిద్రని ఇస్తుంది. కాబట్టి నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. అలానే అల్జీమర్ సమస్య, పార్కింగ్సన్స్ సమస్య వంటి వాటి నుండి కూడా రక్షిస్తుంది బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది.
అలాగే వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకుంటుంది. అబ్డామినల్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ వంటివి రాకుండా బ్రౌన్ రైస్ సహాయం చేస్తుంది. బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి.