తులసి నూనెతో జలుబు పరార్..

శుక్రవారం, 5 నవంబరు 2021 (20:54 IST)
తులసి నూనెలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తులసిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. పోషకాలు, అందాన్ని పెంచే గుణాలు కూడా దీనిలో ఉంటాయి. అయితే ఈ రోజు తులసి నూనె వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు. 
 
తులసి నూనెతో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. అదే విధంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్, యాక్ని వంటి సమస్యలు తగ్గుతాయి. తులసి నూనె అజీర్తి సమస్యలను తొలగిస్తుంది. కాన్స్టిపేషన్, స్టమక్ క్రామ్ప్స్ వంటి సమస్యలు తగ్గుతాయి. గ్యాస్ వంటి సమస్యల నుండి కూడా తక్షణ రిలీఫ్‌ను ఇస్తుంది. తులసి నూనెని వాడడం వల్ల జలుబు తగ్గుతుంది. 
 
దగ్గు, ఆస్తమా, సైనస్ మొదలైన లక్షణాలు ఉన్నప్పుడు తులసి నూనెను ఉపయోగిస్తే చక్కటి రిలీఫ్‌ని పొందొచ్చు. అలానే ఇబ్బంది కూడా ఉండదు. తులసి నూనెను అరోమా థెరపీకి కూడా వాడతారు. ఇది చాలా ప్రశాంతంగా ఉంచుతుంది అదే విధంగా ఒత్తిడి, డిప్రెషన్, మైగ్రేన్, మానసిక సమస్యలను ఇది తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు