కంటి కిందటి నల్లటి వలయాలను దూరం చేసే పాలకూర

సోమవారం, 20 ఆగస్టు 2018 (17:56 IST)
పాలకూర తింటే.. కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. యాంటీ ఏజింగ్ గుణాలు పాలకూరలో పుష్కలంగా వుంటాయి. అందుచేత నిత్య యవ్వనులుగా కనిపించాలంటే.. రోజుకు అర కప్పు పాలకూర తీసుకోవాలి. పాలకూర చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. చర్మ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.
 
ఆరోగ్యపరంగా చూస్తే.. పాలకూర తినడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. పాలకూరలో కేలరీలు, ఫ్యాట్ తక్కువగా వుండటం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చు. రక్తపోటు సాధారణ స్థాయిలో వుండేలా చూస్తుంది. 
 
ఆస్టియోపొరాసిస్, గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. జీవక్రియను పెంపొందింపజేస్తుంది. ఇందులోని విటమిన్-కె హిమోఫీలియా చికిత్సకు సహాయపడుతుంది. రక్తస్రావాన్ని ఆపే గుణం పాలకూరలో వుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు