చాలా మంది పిల్లలు లేదా పెద్దలు వచ్చే తుమ్మును బలవంతంగా ఆపుతుంటారు. నిజానికి తుమ్మితే "చిరంజీవ" అంటూ పెద్దలు దీవిస్తారు. పైగా, తుమ్మిన వెంటనే బయటికి పోవద్దని, కాసేపు ఆగి, నీళ్లు తాగివెళ్లాలని చెబుతున్నారు. కానీ, అదే పెద్దల్లో కొంతమంది ఆ తుమ్మును ఆపుతారు. ఇలా చేయడం చాలా ప్రమాదమని వైద్యులు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
* తుమ్ము విషయంలో నిర్లక్ష్యంగా తగదని, తుమ్మును ఆపితే ప్రాణాంతకమంటున్నారు.
* గంటలకు వంద మైళ్ల వేగంతో వచ్చే తుమ్మును బలవంతంగా ఆపితే చనిపోయే ప్రమాదం కూడా ఉందని లీసెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు.
* దీంతో తుమ్మవేగానికి అతడి గొంతులోపల రంధ్రం ఏర్పడింది.
* ఆ తర్వాత గొంతు వాచిపోయి నొప్పి ఎక్కువ కావడంతో ఆస్పత్రిలో చేరాడు.
* పరీక్షలు చేయగా, గొంతులో రంధ్రం ఏర్పడిందని, గాలి బుడగలు.. వేగంగా వెళ్లి గుండె కండరాలు, కణజాలాల్లోకి చేరాయని తేలింది.
* ఇంకొంచెం ఆలస్యం చేసి ఉంటే ప్రాణానికి ముప్పు వాటిల్లేదని వైద్యులు చెప్పారు.
* తుమ్ముతో గాలి బలంగా ముక్కు, నోటి ద్వారా బయటకు వస్తుంది. దాన్ని ఆపితే ప్రతికూల ప్రభావం ఉంటుంది.