రాగిపాత్రలో నీటిని సేవిస్తే.. బరువు సులభంగా తగ్గిపోతారట...

మంగళవారం, 6 నవంబరు 2018 (14:07 IST)
రాగిపాత్రలో నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా.. చర్మానికి కూడా రక్షణ లభిస్తుంది. రాగిపాత్రలో నీటిని సేవించడం శరీరంపై వున్న  మచ్చలను తొలగిస్తుంది. గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. లోహం అనేది క్షారగుణం కలిగి ఉంటుంది కాబట్టి, అసిడిటీని తగ్గిస్తుంది. కొవ్వును కరిగించడంలో రాగి కీలక పాత్ర పోషించి అధిక బరువును పెంచుకోకుండా కాపాడుతుంది. దీంతో ఊబకాయం సమస్యకు నివారణ ఉంటుంది. 
 
కొలెస్ట్రాల్‌ను నియంత్రించి.. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గుండెపోటు వచ్చే అవకాశాన్ని రాగి పాత్రల్లో నీరు తాగడంద్వారా తగ్గించుకోవచ్చు. రాగికి నొప్పి, మంట తగ్గించే గుణాలున్నాయి. ఆ కారణంగా కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. రాగి కారణంగా అవసరమైనంత మెలనిన్‌ ఉత్పత్తి అవుతుంది. రాగి పాత్రల్లోని నీరు తాగడం వలన రక్తహీనత అదుపులో ఉంటుంది.
 
ఇంకా రాగి పాత్రలో కేవ‌లం మూడు గంట‌ల పాటు నీటిని నిల్వ ఉంచితే చాలు. ఆ నీటిలో ఉండే క్రిములు నశిస్తాయి. దీంతో ఆ నీరు ప‌రిశుభ్రంగా మారుతుంది. రాగి పాత్ర‌ల‌లో నీటిని నిల్వ ఉంచ‌డం వ‌ల్ల ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ-కొలి బాక్టీరియా కూడా అంతమ‌వుతుంది. దీని వ‌ల్ల అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. 
 
రాగి పాత్ర‌ల్లో నిల్వ ఉంచిన నీటిని తాగ‌డం వ‌ల్ల అజీర్ణం, డ‌యేరియా, కామెర్లు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. గుండె స‌మ‌స్య‌లు రావు. క్యాన్స‌ర్ క‌ణాలు న‌శిస్తాయి. థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెర‌గ‌వుతుంది. ర‌క్త‌హీన‌త పోతుంది. హైబీపీ త‌గ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు