పిస్తా పప్పులు అధికంగా తింటే ఏమవుతుందో తెలుసా?

శనివారం, 18 జూన్ 2022 (19:44 IST)
పిస్తాపప్పులు. ఇవి అత్యంత రుచికరమైన గింజలలో ఒకటి. వీటితో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. వీటిని చాక్లెట్లు, ఐస్ క్రీం, క్యాండీలు, డెజర్ట్‌లు, ఇతర వంటలలో ఉపయోగిస్తారు. ఐతే ఈ రుచికరమైన గింజ నిర్దిష్ట వ్యక్తులకు విషపూరితం కావచ్చని, తెలియని ప్రతికూల దుష్ప్రభావాలను కలిగి ఉంటుందని చెబుతారు. పిస్తా పప్పుతో దుష్ప్రభావాలు ఏమిటో చూద్దాం.

 
పిస్తాలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది మన కడుపుకు ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణశయాంతర ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఎక్కువ ఫైబర్ కలిగి ఉండటం వల్ల కడుపులో విరేచనాలు, కడుపు నొప్పి వంటివి కలగవచ్చు. కాబట్టి, పిస్తాలను మితంగా తినాలి. పిస్తాపప్పులు కొందరు ఎక్కువగా తినేస్తుంటారు. ఇలా తినేవారి విషయంలో బరువు పెరగడానికి మూలం కావచ్చనేది గమనిక. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే పిస్తా పప్పులు తినడం కాస్త తగ్గించుకోవాలి.

 
పిస్తాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అధిక పొటాషియం కిడ్నీలకు హాని కలిగిస్తుంది. కిడ్నీ వ్యాధులు ఉన్నవారు ఆహారంలో అధిక పొటాషియం తీసుకోవడం మానేయాలి. పిస్తాపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల వికారం, బలహీనత, పల్స్ నెమ్మదించడం, గుండె కొట్టుకోవడానికి దారి తీయవచ్చు. మనం తినే పిస్తాలో ఎక్కువ భాగం కాల్చినవి, అంటే అవి అధిక ఉప్పు స్థాయిని కలిగి ఉంటాయి. సోడియం అధిక వినియోగం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది అధిక రక్తపోటుకు కూడా కారణమవుతుంది, ఇది దీర్ఘకాలంలో ప్రమాదకరం.

 
పిస్తా గింజలు వేడి, పొడిగా ఉంటాయి, సాంప్రదాయ ఔషధం ప్రకారం, అవి చెడు స్వభావం ఉన్నవారికి మంచివి కావు. కాబట్టి, అలాంటి వారు పిస్తాలను వెనిగర్‌తో కలిపి తింటే మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు