మినరల్ వాటర్ వద్దు.. కుండనీరే ముద్దు.. కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయట..! (Video)

మంగళవారం, 30 జూన్ 2020 (23:15 IST)
water
మినరల్ వాటర్ తాగుతున్నారా? అయితే ఆ నీటిని తాగడం ఇక ఆపేయండి అంటూ హెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం అందరూ తాగే మినరల్ వాటర్‌లో మినరల్స్ లేవు. ఆ నీటితో కిడ్నీ సమస్యలు తప్పవట. ఇంకా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అందుకే మినరల్ వాటర్ కంటే కుండనీరు తాగడం మంచిదని.. ఇంట్లో వాడే మంచినీటిని కాచి చల్లార్చి.. ఓ రాగి పాత్ర లేదా కుండలో పోసి ఆ నీరు తాగడమే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మినరల్ వాటర్ తాగడం ద్వారా తక్కువ వయసులోనే మోకాళ్ల నొప్పులు వస్తాయి. అందులోనూ అవి ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ క్యాన్లలో వచ్చే నీటిని తాగకపోవడమే మంచిది. ఎందుకంటే శరీరానికి అవసరమైన కాల్షియం, సోడియం, పాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం వంటి మినరల్స్ వంటివి మినరల్ వాటర్‌లో దొరకవు. 
 
అదే కుండనీరు తాగితే.. ఎముకలకు అందాల్సిన కాల్షియం సరిగ్గా అందుతుందన్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గడం, ఎముకల్లో బలహీనత ఏర్పడటం వంటి రుగ్మతలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సో.. మినరల్ వాటర్ తాగకపోవడమే మంచిది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు