లోబీపీ ఉన్నవారు ఉప్పు ఎక్కువగా తీసుకోవాలి. అలా అని చెప్పి నిత్యం మోతాదుకు మించి తినరాదు. కాకపోతే ఉప్పు వాడకం పెంచాలి. దీంతో బ్లడ్ ప్రెషర్ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. లోబీపీ తగ్గుతుంది. లోబీపీ ఉన్నవారు రోజుకు మూడు సార్లు కాకుండా ఐదు లేదా ఆరు సార్లు కొద్ది కొద్దిగా భోజనం తీసుకోవాలి. లోబీపీ ఉన్నవారు నీటిని బాగా తాగాలి. దీంతో రక్తం పరిమాణం పెరుగుతుంది. లోబీపీ రాకుండా నియంత్రించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే వారం రోజులపాటు ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు పచ్చి బీట్‌రూట్ రసం తాగితే రక్త ప్రసరణను క్రమబద్ధీకరించవచ్చు. దానిమ్మ రసం కూడా రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. అలాగే వారం రోజులపాటు తాజా పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటే లో బీపీ క్రమబద్ధం కావటంతోపాటు శారీరక వ్యవస్థ మొత్తం శక్తివంతం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.