ముఖ్యంగా రోజంతా నాలుగైదు కప్పుల పాల టీ తాగడం వల్ల వికారం, కడుపు ఉబ్బరం అనిపించవచ్చు. నాలుకపై పూత పూసినట్లు అనిపిస్తుంది. నోటి నుంచి వెలువడే శ్వాస దుర్వాసన వస్తుంది. టీలోని కెఫిన్ అశాంతిని కలిగిస్తుంది. నిద్ర చక్రానికి ఆటంకం కలిగిస్తుంది. దీని వలన అలసిపోతారు. అందువల్ల సాధ్యమైనంత మేర టీ తాగటాన్ని పరిమితంగా చేసుకోవడం ఉత్తమం.