కూల్‌డ్రింక్స్‌లో కేలరీలు, అలాగే చక్కెర శాతం ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల షుగర్, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదముంది. బరువు తగ్గాలనుకునే వాళ్లు కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండడం చాలా మంచిది. కూల్‌డ్రింక్స్‌లో సోడా శాతం అధికంగా ఉంటుంది. ఫలితంగా తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై మళ్లీ మళ్లీ ఆకలేస్తుంది. ఎక్కువ ఆహారం తింటారు. దీంతో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.